యాలో యాలా పాట యొక్క సాహిత్యాన్ని (Yaalo Yaalaa Song Lyrics) ఈ ఆర్టికల్ లో క్లుప్తంగా విశ్లేసిద్దాం. ఇది 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోని పాట. సందీప్ రెడ్డి వంగా నిజంగా మిగతా దర్శకుల కంటే కూడా భిన్నమైన వ్యక్తి. మరి లేకపోతే తీసిన మూడు సినిమాలకే (అందులో ఒకటి రిమేక్) అతని తర్వాత సినిమాలపై అంచనాలు తారాస్థాయికి చేరినాయి. ఈ యానిమల్ (2024) సినిమా తర్వాత ఈయన ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమా తీయబోతున్నాడు. యానిమల్ సినిమా దాదాపు మూడు గంటలవరకు ఉంటుంది. ఎడిటింగ్ లో తీసివేయవలసిన సీన్లు చాలానే ఉన్నాయి అని చాలా చెబుతున్నారు. దీనికి సందీప్ రెడ్డి ఏమి చెబుతున్నారంటే ఆ సీన్లవల్ల సినిమా నిడివి పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు ఉంచవలసిందంటే ఆ సీన్లవల్ల ఆ పర్టికులర్ క్యారెక్టర్ గురించి మరింత లోతుగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చెప్పాడు. ఇక యాలో యాలా పాట గురించి చెప్పాలంటే, కేవలం పాటను వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది, అదే ఆ పాటను వీడియోతో పాటుగా చూస్తే ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో ఈ పాటే వచ్చే సమయంలో జరుగుతున్న సన్నివేశం చెప్తే శాక్ అవుతారు. అక్కడ జరిగేది మన ఆల్ఫా మెన్ రణ్ విజయ్ కు మరియు విలన్ అయిన అబ్రార్ హక్ (బాబీ డియోల్ పాత్ర) మధ్య ఫైట్. ఇదేంటి హీరో మరియు విలన్ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు, హీరో తన నాన్న గురించి పాట పాడుతన్నట్టు ఉండడం ఏమిటో తర్వాత వివరంగా చర్చిద్దాం.
“యాలో యాలా” పాటను తెలుగులో రాసింది అనంత శ్రీరామ్. ఇక్కడ ప్రత్యేకంగా తెలుగు రాసింది అని ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఒరిజినల్ హిందీ సినిమా కావడంవల్ల మరియు ఈ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకులు హింది (మరియు పంజాబి) కి సంబందించినవారు అవ్వడం వల్ల మొదట అన్ని పాటలను హిందీలో రాసి, తర్వాత వేరే భాషలలో రాశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ యానిమల్ సినిమాలోని తెలుగు పాటలన్ని మన అనంత శ్రీరామ్ వ్రాసాడు. ఇక ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది రాజీవ్ కుమార్ అలియాస్ జానీ. ఈయన కేవలం పాటల కంపోజర్ మాత్రమే కాదూ గేయ రచయిత కూడాను. జాని హింది మరియు పంజాబి భాషలలో పాటలకు సంగీతం ఇవ్వడం వల్ల ప్రసిద్ధిగాంచాడు. ఇతను 1989లో పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. ఈయనకు హోటెల్ మ్యానేజ్మెంట్ లో డిప్లామో ఉన్న కూడా సంగీతంపై మక్కువతో సంగీత దర్శకుడిగా, గేయరచయితగా మారి ఎన్నో హిట్ పాటలకు అందిచారు. ఈయన తను నటుడిగా కూడా ప్రేక్షకుల్లో తగిన గుర్తింపు పొందారు. 2021లో పంజాబీ చిత్రం ఖిస్మత్ 2లో నటుడిగా తెరపైకి అడుగుపెట్టాడు.
ఇక ఈ పాటను పాడింది అనురాగ్ కులకర్ణి. ప్రస్తుతం మన తెలుగులో చాలా బిజీగా ఉన్న గాయకుల్లో అనురాగ్ ఒకరు. తెలంగాణాలోని కామారెడ్డిలో జన్మించిన అనురాగ్ చిన్నప్పుడు సంగీతంపై ఆసక్తితో హిందూస్తాని సంగీతాన్ని నేర్చుకున్నాడు. 2015లో తెలుగు రియాలిటి షో ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8లో భాగవహించి ఆ సీజన్ యొక్క విజేతగా నిలిచారు. అనురాగ్ కులకర్ణీ 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను దాదాపు 800 లకు పైగా పాటలను పాడినట్టు చెప్పుకొచ్చాడు. దీని బట్టి తెలుస్తుంది ఈయన ఎంత పెద్ద బిజీ సింగరో. ఈ మధ్యకాలంలో మనం వినే చాలా హిట్ పాటల్లో ఈయన పాడిన పాటలు కూడా చాలానే ఉంటాయి. మంచి పాటలు వెతుకుంటు మరి అనురాగ్ స్వరాల్లోంచి ప్రేక్షకుల దగ్గరకు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఈ “యాలో యాలా” పాట కూడా ఒకటి. యాలో యాలా పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
Song Details
- పాట: యాలో యాలా
- సినిమా: యానిమల్ (Animal)
- నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా
- సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- సంగీత దర్శకుడు: జాని
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకుడు: అనురాగ్ కులకర్ణి
- సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Yaalo Yaalaa Song Lyrics in Telugu
హో యాలో యాలా యాలోరే
హో ఎన్నో ఏండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
హో ఎన్నో ఏండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
ఎన్నో ఏండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే
ఎన్నో ఏండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే
మండేటి ఎండల నుండి
ఎగసిపడే సూరీడులాగొస్తా
కమ్మేటి మబ్బులు కాల్సి
నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంట నిన్ను నాలోనా
అచ్చేసుకుంట నిన్ను నా మీనా
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామివంటే నువ్వే లోకానా
సెమ్మ సేరదు మీ కంటా
ఓ సెమ్మ సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా
హో పిడుగై నేనటే రానా
హో బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
Yaalo Yaalaa Lyrics in English
Ho Yaalo Yaalaa Yaalore
Ho Enno Yendla Seekatiki
Poddhu Podisindhayyo Ee Yaale
Ho Enno Yendla Seekatiki
Poddhu Podisindhayyo Ee Yaale
Ho Yaalo Yaalaa Yaalore
Ho Yaalo Yaalaa Yaalore
Enno Endla Aakaliki
Yaata Modhalaindayyo Ee Yaale
Enno Endla Aakaliki
Yaata Modhalaindayyo Ee Yaale
Mandeti Endala Nundi
Egasipade Sooreedu Laagostha
Kammeti Mabbulu Kaalsi
Nee Suttu Ennellu Pongisthaa
Nimpesukunta Ninnu Naalonaa
Achesukunta Ninnu Naa Meena
Mokkedhi Ninne Yeppudainaa
Naa Saamivante Nuvve Lokaanaa
Semma Seradhu Mee Kantaa
O Semme Seradhu Mee Kanta
Ammathodu Nenundagaa
Meeku Aapadhe Raadhantaa
Ho Pidugai Nenate Raanaa
Ho Badabaagnulu Eedhainaa
Bhoominainaa Buggi Seseynaa
Neeku Emannaithe Naannaa
Bhoominainaa Buggi Seseynaa
Neeku Emannaithe Nanna
Yaalo Yaalaa (యాలో యాలా) Video Song
Meaning of the song “Yaalo Yaalaa” from Animal (2023)
ఈ పాటలోని ప్రతి పంక్తి పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను, ప్రేమను, కష్టాలను ఎంతో ఉదాత్తంగా చెబుతుంది. పాటలో వాడిన ప్రతి పదం కథలోని కథానాయకుడి భావాలను ప్రతిబింబిస్తుంది. హీరో రణ్ విజయ్ తన తండ్రి పట్ల అనురాగం, క్షమ, ధైర్యం, మరియు పోరాటశీలతను ఈ పాట ద్వారా వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు ప్రతి పంక్తిని మరింత వివరంగా చూడవచ్చు:
“హో యాలో యాలా యాలోరే” ఈ పంక్తి పాత్రలోని భావోద్వేగానికి ఒక ఆరంభంగా వినిపిస్తుంది. “యాలో” అనే పదం ఒక విరామాన్ని, ప్రశాంతతను సూచిస్తూనే, కథానాయకుడు తన తండ్రి పట్ల ఉన్న బాధను, బాధ్యతను వ్యక్తం చేస్తాడు. ఈ పాటలోని సాహిత్యం ఒక ప్రయాణం, ఆ ప్రయాణం గమ్యానికి చేరే ముందు ఆలోచనల సమాహారంగా కనిపిస్తుంది. “హో ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే” ఈ పంక్తి అనేక ఏళ్ల కష్టాలు, చీకటిని పోగొట్టే ఉదయం ఎట్టకేలకు వచ్చింది అని సూచిస్తుంది. కథానాయకుడు తన తండ్రిని కాపాడేందుకు పోరాడుతున్నప్పుడు ఈ వాక్యం తన జీవితంలో జరుగుతున్న మార్పును ప్రతిబింబిస్తుంది. చీకటి నుండి వెలుగుకు మారడం, కష్టాల నుండి విజయానికి చేరుకోవడం అనేది ఈ పంక్తి ప్రధానాంశం.
“ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఈ యాలే” ఇక్కడ ఆకలి అనేది ఒక రకమైన తాపత్రయంగా ఉంది. అనేక ఏళ్లుగా ఉన్న ఆకలి, దాహం ఇప్పుడు తీరిపోబోతుందని చెప్పే సందర్భం ఇది. రణ్ విజయ్ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించబోతున్నాయి అని ఈ వాక్యం ద్వారా వ్యక్తం చేయబడుతుంది. ఇదే ఒక ముగింపు తీరంలోకి వెళ్లే సంకేతం. “మండేటి ఎండల నుండి ఎగసిపడే సూరీడులాగొస్తా” ఈ వాక్యం చాలా బలమైనది. రణ్ విజయ్ తన తండ్రి కోసం సూర్యుడిలా రౌద్రంగా ముందుకు వస్తున్నాడు. ఎండ ఎలాంటి అడ్డంకి అయినా ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది. అతను తండ్రి జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చిన తేజం లాంటివాడని ఈ పంక్తి చెబుతుంది.
“కమ్మేటి మబ్బులు కాల్సి నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా” మబ్బులు చల్లబడినప్పుడు వచ్చే వర్షం వాతావరణాన్ని ప్రశాంతంగా చేస్తుంది. ఈ వాక్యం ద్వారా హీరో తన తండ్రికి ఒక శాంతి, ఆనందాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని చూపిస్తుంది. తండ్రి జీవితంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దూరం చేయడానికి తన ప్రేమ, కాపాడటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. “నింపేసుకుంట నిన్ను నాలోనా అచ్చేసుకుంట నిన్ను నా మీనా” ఇక్కడ హీరో తన తండ్రిని తన మనసులో, జీవితంలో స్థిరంగా స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. తండ్రి అనురాగం తనలో ఎప్పటికీ ఉండిపోవాలని భావిస్తూ, అతనికి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాడు. తండ్రి ప్రేమతో నిండిన మనసును ప్రతిబింబించడానికి ఈ వాక్యం ఉపయోగించబడింది.
“మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామివంటే నuv్వే లోకానా ఈ వాక్యంలో హీరో తన తండ్రిని దేవుడిగా చూస్తున్నట్టు చెబుతున్నాడు. తండ్రి తనకు జీవితంలో చాలా విలువైనవాడని, ఆయనకంటే గొప్పవాడు ఎవరూ లేరని వ్యక్తం చేస్తాడు. ఈ భావన తండ్రి ప్రేమను, కాపాడుకునే బాధ్యతను గురించి ప్రస్తావిస్తుంది. “సెమ్మ సేరదు మీ కంటా ఓ సెమ్మ సేరదు మీ కంటా” ఇక్కడ “సెమ్మ” అనే పదం విలువైన వస్తువు లేదా వ్యక్తిగా చెప్పబడింది. హీరో తన తండ్రిని కాపాడటం ద్వారా అతనికంటే విలువైనది మరొకటి లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వాక్యం తండ్రి అనుసరించే విలువలను, అతని ప్రాధాన్యతను గౌరవించడాన్ని సూచిస్తుంది.
“అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా” తండ్రి ప్రేమ, ఆప్యాయతను అర్థం చేసుకుని, తాను తన తండ్రికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ కల్పించగలనని హీరో చెబుతున్నాడు. తండ్రి పట్ల ఉన్న ఈ భరోసా, ప్రేమ తాత్పర్యాన్ని వ్యక్తం చేస్తుంది. “హో పిడుగై నేనటే రానా హో బడాబాగ్నులు ఈదైనా” ఈ వాక్యం హీరో శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుంది. పిడుగు లాంటి వేగంతో తన తండ్రి మీద పడే ప్రతీ సమస్యను తాను ఎదుర్కొంటానని చెబుతున్నాడు. కష్టాలు, సవాళ్లు వచ్చినా తాను వాటిని ఎలా సమర్ధంగా ఎదుర్కోగలనో చెప్పడానికి ఉపయోగించబడింది. “భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా” తన తండ్రిని రక్షించడంలో హీరో తన శక్తిని, బలాన్ని తండ్రి కోసం వినియోగించుకుంటాడు. భూమినైనా తిరగేసి తండ్రికి ఏం కావాలన్నా చేస్తానన్నంతటి ప్రేమ, భక్తిని వ్యక్తం చేసే పంక్తి ఇది.
Conclusion (ముగింపు)
సందీప్ రెడ్డి వంగా విలక్షణమైన దర్శకుడు అని ఈ యొక్క పాట ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకుంటే అక్కడ జరిగే సన్నివేశం హీరో విలన్ మధ్య ఫైట్ సీన్. కానీ బ్యాగ్రౌండ్ లో ప్లే అయ్యేది మాత్రం క్లాసిక్ గా సాగే నాన్న పాట. అంటే హీరో రణ్ విజయ్ తన నాన్న గురించి పాట పాడుతున్నట్టు ఉంటుంది. ఇంతకి ఈ పాట సందర్భాన్ని చెప్పాలంటే సినిమా కథను సింపల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది క్లైమాక్స్ ఫైట్ కాబట్టి. హీరో రణవిజయ్ నాన్న ఒక పెద్ద పారీశ్రామికవేత్త ఆయనను చంపాలని విలన్ గ్యాంగ్ ఒకసారి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో వాళ్ళు ఎవ్వరు ఎందుకు తన నాన్నను చంపడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాలని రకరకాల పద్దతిలో తెలుసుకుంటాడు. దానికి ముఖ్య కారణం హబ్రార్ అని తెలుసుకుని వాడు వేరే దేశంలో (దుబాయ్ అనుకుంటా) ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి మరి చంపేస్తాడు. చంపె ముందు జరిగే ఫైట్ లో బ్యాగ్రౌండ్ లో ఈ పాట కొనసాగుతూ ఉంటుంది.
ఈ పాట ద్వారా రణ్ విజయ్ కు తన తండ్రిపై ఉన్న గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తాడు. “ఎన్నో ఏండ్లా ఆకలికి యేటా మొదలైందయ్యో ఈయాలే” అనే వాక్యం ద్వారా ఇన్నాళ్ళు తన నాన్నను ఎవ్వడు చంపాలనుకుంటున్నాడో వెదుకుతూ ఉన్నాడు. ఈరోజు వాడెవడో తెలిసి, వాడి అంతు చూస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఫైటే మధ్య ఇలాంటి పాటను చూడడం నాకైతే ఇదే ఫస్ట్. ఆ ఫైట్ ను కంపోజ్ చేసిన విధానం కూడా చాలా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ఈ ఫైట్ లో హీరో మరియు విలన్ కు సంబంధించిన వారు ఆ ఫైట్ ని దూరం నుంచి చూస్తూ ఉంటారు, కేవలం హీరో విలన్ మాత్రమే పోటాపోటీగా రెండు చిరుత పులుల్లా దాదపు రెండు గంటల పాటు కొట్టుకుంటు ఉంటారు. ప్రతీ సినిమాలో జరిగే విధంగానే చివరకు హీరోనే గెలవాలి కాబట్టి, మన హీరో విలన్ ని గొంతు కోసి చంపేస్తాడు.
అనంత శ్రీరామ్ సాహిత్యం, జానీ సంగీతం, అనురాగ్ కులకర్ణీ గానం మరియు ఆ ఫైట్ సీన్ తీసిన విధానం ఇలా అన్ని కలిసి ఈ “యాలో యాలా” పాటను ఒక ప్రత్యేక పాటలాగా మార్చేశాయి. ఈ పాటలో వాడిన సంగీతం మనల్ని అలా ఏదో ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళడం పక్కా.