Antaraani Vaadavantu Song Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Antaraani Vaadavantu’ in both Telugu and English. Antaraani Vaadavantu song lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Antaraani Vaadavantu Song Lyrics in Telugu


అంటరాని వాడవంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి
దుర్వాసనతో నిండిపోయే
అయిన వారు కానరాక
భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక
ఒంటరిగ జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా
మరణమును బ్రతిమాలుకున్నా
అదియు నన్ను ముట్టలేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను
నేను అలసిపోయాను
నీ దరికి చేరాను
నిన్నే నమ్ముకున్నాను
యేసు యేసు యేసు నా తట్టు తిరగవా
యేసు యేసు యేసు నా గోడు వినవా
|| అంటరాని వాడవంటు ||

నిలిచిపోయావు నా కేక వినగానే
కదలిపోయావు నా స్థితిని చూడగనే
నీ కడుపులోని దుఖమును
నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి
కన్నీటితో తడిసిపోయాను
యేసు యేసు యేసు నీకెంత జాలి
చాలు చాలు చాలు నీ దయయే చాలు
|| అంటరాని వాడవంటు ||

నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము
నా దేహము పైన ఉండగనే
నా గుండె లోపల మండుచున్న
కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా
నే తపియించి పోయాను
యేసు యేసు యేసు నీలా ఉందురెవరు
చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు
|| అంటరాని వాడవంటు ||

స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు
నరులు ఎవ్వరు
యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు నాకింక నీవే చాలు
|| అంటరాని వాడవంటు ||

Antaraani Vaadavantu Song Lyrics in English


Antaraani Vaadavantu Nannu
Ooru Baitaku Throsi Vesiri
Dehamanthaa Killupoyi
Durvaasanatho Nindipoye
Ayina Vaaru Kaanaraaka
Bhujamu Thatte Vaaru Leka
Kanti Nindaa Nidura Poka
Ontariga Jeevinchaleka
Maranamunu Brathimaalunnaa
Maranamunu Brathimaalunnaa
Adiyu Nannu Muttaledu
Chaavaleka Brathukaleka
Visikipoyaanu
Nenu Alasipoyaanu
Nee Dariki Cheraanu
Ninne Nammukunnaanu
Yesu Yesu Yesu
Naa Thattu Thiragavaa
Yesu Yesu Yesu
Naa Godu Vinavaa
|| Antaraani Vaadavantu ||

Nilichipoyavu Naa Keka Vinagane
Kadalipoyaavu
Naa Sthithini Choodagane
Nee Kadupuloni Dukhamunu
Nee Mukhamupai Choosi
Nenu Karigipoyaanu
Nee Kanikaramu Choosi
Kanneetitho Thadisipoyaanu
Yesu Yesu Yesu Neekentha Jaali
Chaalu Chaalu Chaalu
Nee Dayaye Chaalu
|| Antaraani Vaadavantu ||

Nannu Thaakaavu
Nee Chethulanu Chaapi
Kushtu Rogamu Naa
Dehamu Paina Undagane
Naa Gunde Lopala Manduchunna
Korikanu Choosi
Nannu Muttukunnaavu
Aa Sparsha Korake Kadaa
Ne Thapiyinchi Poyaanu
Yesu Yesu Yesu Neelaa Undurevaru
Chaalu Chaalu Chaalu
Nee Sparsha Chaalu
|| Antaraani Vaadavantu ||

Swasthaparichavu
Shuddhunigaa Chesaavu
Muriki Koopamu Nundi
Nannu Levanetthaavu
Naa Thalanu Paiketthukoni
Brathike Tharunamichchaavu
Naaku Brathuku Nichchaavu
Ninu Aashrayinchi Niraasha Chendu
Narulu Evvaru
Yesu Yesu Yesu Dandamulu Neeku
Chaalu Chaalu
Naakinka Neeve Chaalu
|| Antaraani Vaadavantu ||

Antaraani Vaadavantu Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top